TPT: అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డీపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యపై సత్యవేడు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సెక్రటరీ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.