ASR: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు పోస్టర్ను బుధవారం చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సదస్సు ఏప్రిల్ 12న రంపచోడవరంలో నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు.