MULG: ములుగు జిల్లాలోని తెలంగాణ- చత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ పర్యటించిన నేపథ్యంలో ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో అక్కడ మట్టి రోడ్డు నిర్మించారు. సుమారు 8.76 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రోడ్డు రాకపోకలను సులభతరం చేయనుంది.