ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి మీరు అరెస్ట్‌లో ఉన్నారని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి కాల్స్ నమ్మకుండా వెంటనే కట్ చేయాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.