షావోమీ నుంచి 17, 17 అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. లైకా భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఉన్నాయి. షావోమీ 17 ధర రూ.89,999 నుంచి ప్రారంభం కాగా, అల్ట్రా మోడల్ ధర రూ.1,39,999. అల్ట్రాలో 200MP టెలీఫొటో లెన్స్ ప్రత్యేకం. ఐపీ 68/69 రేటింగ్, 50MP సెల్ఫీ కెమెరా వీటి సొంతం. ఈ నెల 17లోపు కొంటే ఫొటోగ్రఫీ కిట్ ఉచితం.