AKP: పాయకరావుపేట మండలంలో ఈనెల 16 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో రమేష్ బాబు తెలిపారు. మండలంలో మొత్తం ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులు కలిపి 1,503 మంది పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. పాయకరావుపేట పట్టణంలో ఐదు కేంద్రాలు, ఎస్ నర్సాపురం, పాల్తేరు జడ్పీ హైస్కూల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.