కడప: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ప్రజలు తమ అర్జీలతో హాజరై సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.