TG: వ్యవసాయ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతు భరోసాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెలాఖరు నుంచి రైతు భరోసా వేసేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా 2 విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.