కోనసీమ: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. జిల్లాలో రౌడీయిజం అణిచివేతకు రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ రౌడీ షీటర్ల ప్రవర్తనను సమీక్షించి, పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.