NRML: బాసరలోని పలు గ్రామాల్లో విద్యుత్ కేబుల్ వైర్ల వరుస దొంగతనాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఓని గ్రామ పరిధిలోని వ్యవసాయ బోర్ల వద్ద ఏడుగురు రైతులకు చెందిన కేబుల్ వైర్లను దుండగులు రాత్రికి రాత్రే కత్తిరించి ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, పొలాలకు నీరు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.