VZM: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కోరింది. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ జై మహేంద్ర బాబు ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.