WG: మొగల్తూరు మండలంలో 17 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి బయటకు వెళ్లిన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI జి. వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.