KRNL: ఓర్వకల్లు (M) నన్నూరులోని ఎంపీపీ స్కూలులో అక్షరాంద్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు APM వెంకటరామిరెడ్డి తెలిపారు. వయోజన అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించి వారిని సామాజిక సాధికారత వైపు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.