• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా రాజగోపాలరావు వర్ధంతి వేడుకలు

SKLM: శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలింగుల సంక్షేమానికి రాజగోపాలరావు చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ సంతోష్ తెలిపారు.

February 22, 2026 / 01:04 PM IST

నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏప్రిల్ నెలలో మరల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 01:04 PM IST

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JGL: బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామంలోని గొల్ల కేతమ్మ ఆలయంలో ఆదివారం మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:03 PM IST

జనసేన సభ్యత్వ నమోదు పై కీలక సమావేశం

VSP: విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వివరించారు. సభ్యత్వ నమోదు విధానం, చేపట్టాల్సిన చర్యలపై ఇంచార్జిలకు సూచనలు ఇచ్చారు.

February 22, 2026 / 01:03 PM IST

వీధి కుక్కలకు వైరస్… భయాందోళనలో గ్రామస్తులు..

MLG: ఏటూరునగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని వీధులలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే ప్రజలకు ప్రాణహాని కలగొచ్చని, అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

February 22, 2026 / 01:02 PM IST

పదవి అనేది అధికారం కాదు బాధ్యత: మంత్రి

KMM: ఏదులాపురం ఎన్నికల వరకే రాజకీయం గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలన్నారు. ఆదివారం పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

February 22, 2026 / 01:01 PM IST

నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

February 22, 2026 / 01:01 PM IST

ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 22, 2026 / 01:00 PM IST

తాడిపత్రిలో రోప్ లైట్ పనుల పరిశీలన

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో పట్టణంలో సాగుతున్న రోప్ లైట్ పనులను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింబిలి వెంకటరమణ పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాళ్ల ఉమామహేష్, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

February 22, 2026 / 01:00 PM IST

లయన్స్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్‌గా డీకే.రాజేష్

NZB: ఆర్మూర్‌కు చెందిన డీకే.రాజేష్ లయన్స్ క్లబ్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్ అవార్డును అందుకున్నారు. సికింద్రాబాద్లోని లయన్స్ భవనంలో గవర్నర్ లయన్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్స్ నైట్లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. 12 క్లబ్ల పరిధిలో సభ్యత్వ నమోదు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనను అభినందించారు.

February 22, 2026 / 01:00 PM IST

జాతర మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: 70వ సింగారమ్మ జాతర మహోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో పాల్గొని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌కు ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:00 PM IST

రేపటి నుంచి జిల్లాలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో 49,579 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్, తాగునీరు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. 

February 22, 2026 / 01:00 PM IST

ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి: నటి

బాలీవుడ్ నటి అయేషా ఖాన్ పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి పలువురిని సంప్రదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అయేషా.. ఆ ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌లను, ఫోన్ నంబర్‌ను షేర్ చేస్తూ హెచ్చరించింది. ‘ఇది నా అకౌంట్ కాదు, నమ్మకండి’ అని స్పష్టం చేసింది. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపవద్దని ప్రజలను కోరింది.

February 22, 2026 / 01:00 PM IST

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

SRPT: అనారోగ్యంతో మృతి చెందిన అడిగోడు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కాంపాటి సాయిలు కుటుంబానికి ఆయన బాల్య మిత్రులు అండగా నిలిచారు. ఆదివారం సాయిలు భార్య జానమ్మకు మిత్రబృందం రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేసి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 12:58 PM IST

ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి: ఎంపీ

AP: NTR జిల్లాలో ఆర్గానిక్ రైతు ఉత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. రైతులు వాళ్ల ఉత్పత్తులను వాళ్లే మార్కెట్ చేసేలా.. ఈ పోర్టల్ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోలుదారులు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్గానిక్ ఉత్పత్తిలో జిల్లాను నెం.1గా చేస్తామన్నారు.

February 22, 2026 / 12:57 PM IST