E.G: కడియం మండలం మాధవరాయుడు పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివపంచాయతన క్షేత్రాలయం 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ పందిరిరాట ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ, విజయ దంపతులు పూజ కార్యక్రమం నిర్వహించి పందిరిరాట వేశారు. ఈ కార్యక్రమంలో అన్నందేవుల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.