NZB: సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం టీజీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు.. 400 రోజులైనా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు.
KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట్ పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. గురుకుల ఉపాధ్యాయుడు లక్క చక్రపాణి, హన్మాజీపేట్, కోనాపూర్ పంచాయతీ సెక్రటరీలు రాజేష్, భరత్ దీనికి సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. వీరికి పలు గ్రామ ప్రజలు మద్దతు పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చదివిస్తే బంగారు భవితకు బాటలు వేసినవారవుతారని అన్నారు.
NZB: ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఆర్టీసీ కార్యక్రమాన్ని నేడు సాయంత్రం 4 నుంచి 5గం.వరకు నిర్వహిస్తామని NZB ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఫోన్ చేయాలనుకునే వారు 9959226011కు, ఆర్మూర్ డీఎం-9959226019, బోధన్ డీఎం-9959226001, nzb 1 డీఎం-9959226016, 2డీఎం 9959226017, kmr-9959226018 డీఎంలకు ఫోన్ చేయాలన్నారు.
PDPL: అన్ని రంగాల్లో సుల్తానాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం సుల్తానాబాద్ మున్సిపల్ పూసాల 13వ వార్డులో ప్యాకేజీ- 8 ద్వారా టీయూ ఎన్ఐడీసీ కింద రూ. 38 లక్షల అంచనాతో నిర్మించే నాలుగు సీసీ రోడ్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పల్నాడు: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పొందవచ్చు అని వైసీపీ నూజెండ్ల మండల కన్వీనర్ నక్క నాగిరెడ్డి అన్నారు. నూజెండ్ల మండల పరిధిలోని మారేళ్ళవారిపాలెంలో సంక్రాంతి పురస్కరించుకుని నాలుగు రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ మేరకు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని భూముల పరిశీలనను పక్కగా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె చిట్యాల మండలం వెలిమినేడులో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల బృందాలు నిర్వహిస్తున్న రైతు భరోసా క్షేత్రస్థాయి పరిశీలనను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ATP: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇచ్చిందని కదిరి బీజేపీ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.17,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం వేలాది కార్మికులకు భరోసా కలిగించడంతో పాటు, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తోడ్పడుతుందని వివరించారు.
ATP: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు. ఘటన గురించి జిల్లా అధికారులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించినట్లు తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
యాదాద్రి: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను సందర్భంగా భాగ్యనగరం నుండి తమ సొంత గ్రామాలకు బయలుదేరిన వాహనదారులు హైదరాబాద్ వైపు తిరుగు ప్రయాణంతో రద్దీ నెలకొంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు.
W.G: భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని గురువారం ఇండియన్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పులపర్తి ప్రశాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఆలయ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి ఫొటోను అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గురువారం నాంపల్లి మండల కేంద్రంలో రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర, లేఔట్లు భూముల సర్వే క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేను చండూర్ ఆర్డీవో పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ సర్వే పక్కడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లు కేటాయించిన లక్ష్యాలను నెల రోజుల్లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ATP: తాడిపత్రి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంటపల్లి గ్రామం వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై ఆటో, కారు ఢీకొన్నాయి. కొండాపురం నుంచి తాడిపత్రికి వస్తున్న ఆటో, తాడిపత్రి నుంచి వెళ్తున్న కారు వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KDP: సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 18న మైదుకూరులో పర్యటించే అవకాశం ఉందని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్‌లో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు అందాల్సి ఉందన్నారు.
KDP: కడప నగరంలోని రవీంద్ర నగర్ ఆస్థాన ఏ హజరత్ సయ్యద్ షా సర్మద్ ఖాదరి వారి గంధం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ యూసుఫ్తా ఖాదరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు భారీ సంఖ్యలో భక్తుల తరలివచ్చారు. గంధం ఊరేగింపు, ఫకీర్ల విన్యాసం భక్తులను ఆకట్టుకున్నాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ బాబు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.