PLD: మాచర్లలో గురువారం వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.