NRML: పట్టణంలోని బంగాల్‌పేట్ కాలనీలో శుక్రవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కడప: సిద్దవటం మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా జనసేన నేత అతికారి కృష్ణ అన్నారు. మాధవరం-1 గ్రామంలోని TDP మైనార్టీ నాయకుడు వీరభద్రయ్య ఇంట్లో పట్టపగలే చోరీ జరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి వీరభద్రయ్యకు మనోధైర్యాన్ని నింపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా ఉంచాలని సూచించారు.
KMR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. శాబ్దిపూర్ గ్రామానికి చెందిన యశోద కామారెడ్డిలోని ఓ గోదాం పక్కన నిలబడి ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.
AP: ఇవాళ్టి నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. స్వామివారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
TG: నేడు మెదక్ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. బీజేపీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
SRD: తమ గ్రామంలో మంచినీటి ఎద్దడి నెలకొందని, మిషన్ భగీరథ నీరు రావడంలేదని సిర్గాపూర్ మండలం సుర్త్యాతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయని శంకర్, భీమ్ రావు, తదితరులు ఆవేదనతో తెలిపారు. గత వారం రోజుల నుండి నిల్వ ఉన్న ఉంచిన నీటిని సేవిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరారు.
SRD: డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు నిర్వహిస్తున్న డీఎం మల్లేశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు 90634 17161 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కడప: మైదుకూరు పరిధిలోని మావిళ్ళపల్లెకు ఉత్తర దిక్కులో తిమ్ములమ్మ దేవాలయాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ మీడియాకు తెలిపారు. ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో పురాతన కాలంలో పిచ్చిపాడు అనే గ్రామం ఉండేది. కాలక్రమేణా అంతరించిపోయిందన్నారు. ఆలయ ఛాయాచిత్రాలను ప్రముఖ స్థపతి, వాస్తు శిల్ప కళా వాచస్పతి శివ నాగిరెడ్డికి పంపగా 2వశాతాబ్దా చెందినదని తెలిపారు.
ATP: గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మల్లయ్య యాదవ్‌ను ఏపీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ఎంపిక చేసినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ పదవి కేటాయించిన ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
KKD: జగ్గంపేటకు చెందిన ఒక వివాహిత తన కుమార్తెతో సహా ఇంటి నుంచి వెళ్లి వెళ్ళిపోయింది. దీనిపై కుటంబ సభ్యులు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేశారు. కాకినాడ డీమార్ట్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించి జగ్గంపేట తీసుకువచ్చి బంధువులకు అప్పగించారు. కేవలం 3గంటల్లోనే కేసును ఛేదించారు.
AP: JNTU విద్యార్థులకు గుడ్‌న్యుస్. ఇకపై ప్రతి 4వ శనివారం సెలవు ఇస్తూ VC కిషన్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రకారం రేపు JNTU యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీలకు సెలవు ఉండనుంది. 2008కి ముందు ఇదే తరహా ఆదేశాలు ఉండగా, ఆ తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ సెలవు ఆదేశాలు రావడంతో ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం చేస్తున్నారు.
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు కావలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ అలహరి సుధాకర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం పట్టణంలోని గోమతి నగర్ జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
KMR: డోంగ్లీ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 27న నిర్వహించే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు తహశీల్దార్ రేణుక చౌహన్ తెలిపారు. మండలంలో పట్టభద్రులు పోలింగ్ స్టేషన్ నం. 163లో 107 మంది ఓటర్లు, ఉపాధ్యాయుల కోసం పోలింగ్ స్టేషన్ నం. 107లో 11 మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు.
BDK: ఈ నెల 24న సా.4 గంటలకు GM కార్యాలయంలో అద్దె వాహనాలకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని ఏరియా GM వి. కృష్ణయ్య ప్రకటనలో తెలిపారు. టెండర్లు వేసిన వారి సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి టెండర్ దారులను ఎంపిక చేస్తామన్నారు. టెండర్లు వేసిన అభ్యర్థులందరూ సకాలంలో లక్కీ డ్రా కు హాజరు కావాలని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి మండల వైసీపీ అధ్యక్షునిగా మడతల కస్తూరి రెడ్డి నియమితులయ్యారు. కనిగిరి జడ్పిటిసి సభ్యునిగా పార్టీ బలోపేతానికి కస్తూరి రెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి వైసీపీ అధిష్టానం పార్టీ అధ్యక్షునిగా నియమించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తరువులను జారీ చేసింది. కస్తూరి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.