JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో బాక్స్ క్రికెట్ చిల్డ్రన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలో వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఇందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పులివెందుల పట్టణానికి చెందిన పోరెడ్డి జశ్వంత్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
JGL: గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జగిత్యాల నియోజకవర్గ బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా గెలిపించాలో చర్చించారు. ఈ సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.
MDK: నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని సూచించారు. అంజిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
MDK: నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ అధికారులు రైతులకు యాసంగి పంటలపై తగు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. వరి కోత కోసే సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ యొక్క వేగం 18 – 20 ఆర్పీయం ఉంచడం ద్వారా గింజలు రాలడం తగ్గించవచ్చన్నారు. దాన్ని ముందుగానే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. తేమ 17% ఉండేటట్లు చూడాలన్నారు.
MDK: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
నల్గొండ: మిర్యాలగూడెం నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వచ్చి బైకును, నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవరు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.
SRPT: కోదాడ మండలంలోని గురుకుల పాఠశాలలను ఇవాళ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన ఎలా పెడుతున్నారు. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాల పరిసరాలను పరిశీలించారు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సరిహద్దులో నియంత్రణ రేఖపై ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాలు ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి.
ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, వాతావరణ ఆందోళనలను ప్రపంచం ఎదుర్కొంటోందని తెలిపారు. రానున్న కాలంలో ఏఐ, అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు.
KMR: ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
TG: రాష్ట్రంపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు KCR అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘BRS పాలనలో KCR ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. నీళ్లలో నిప్పు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ మాది. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి నీళ్లని AP తీసుకెళ్తోంది. ఇప్పుడు సాగు, తాగునీరుకు ఇబ్బంది ఏర్పడింది’ అని చెప్పారు
ప్రకాశం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కనిగిరి డిపో నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ నయాన తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని శైవక్షేత్రాలైన పునుగోడు, చంద్రశేఖరపురంలోని మిట్టపాలెం నారాయణస్వామి, భైరవకోన క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 26న శివరాత్రి రోజున ప్రతి 15 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుందన్నారు.
ELR: ప్రతి అర్జీని పరిష్కరించేలా కృషి చేస్తానని అన్ని విధాల నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు.
ELR: ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.