PDPL: రామగుండం NTPC పార్టీ కార్యాలయంలో గురువారం విద్యార్థుల రాజకీయ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ తమ్మెర పేర్కొన్నారు. అనంతరం పార్టీ రామగుండం మున్సిపాలిటీ ఏరియా ఇంఛార్జ్‌గా మనాల భవాని శంకర్‌ను నియమించారు.