ATP: గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మల్లయ్య యాదవ్‌ను ఏపీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ఎంపిక చేసినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ పదవి కేటాయించిన ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
KKD: జగ్గంపేటకు చెందిన ఒక వివాహిత తన కుమార్తెతో సహా ఇంటి నుంచి వెళ్లి వెళ్ళిపోయింది. దీనిపై కుటంబ సభ్యులు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేశారు. కాకినాడ డీమార్ట్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించి జగ్గంపేట తీసుకువచ్చి బంధువులకు అప్పగించారు. కేవలం 3గంటల్లోనే కేసును ఛేదించారు.
AP: JNTU విద్యార్థులకు గుడ్‌న్యుస్. ఇకపై ప్రతి 4వ శనివారం సెలవు ఇస్తూ VC కిషన్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రకారం రేపు JNTU యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీలకు సెలవు ఉండనుంది. 2008కి ముందు ఇదే తరహా ఆదేశాలు ఉండగా, ఆ తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ సెలవు ఆదేశాలు రావడంతో ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం చేస్తున్నారు.
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు కావలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ అలహరి సుధాకర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం పట్టణంలోని గోమతి నగర్ జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
KMR: డోంగ్లీ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 27న నిర్వహించే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు తహశీల్దార్ రేణుక చౌహన్ తెలిపారు. మండలంలో పట్టభద్రులు పోలింగ్ స్టేషన్ నం. 163లో 107 మంది ఓటర్లు, ఉపాధ్యాయుల కోసం పోలింగ్ స్టేషన్ నం. 107లో 11 మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు.
BDK: ఈ నెల 24న సా.4 గంటలకు GM కార్యాలయంలో అద్దె వాహనాలకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని ఏరియా GM వి. కృష్ణయ్య ప్రకటనలో తెలిపారు. టెండర్లు వేసిన వారి సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి టెండర్ దారులను ఎంపిక చేస్తామన్నారు. టెండర్లు వేసిన అభ్యర్థులందరూ సకాలంలో లక్కీ డ్రా కు హాజరు కావాలని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి మండల వైసీపీ అధ్యక్షునిగా మడతల కస్తూరి రెడ్డి నియమితులయ్యారు. కనిగిరి జడ్పిటిసి సభ్యునిగా పార్టీ బలోపేతానికి కస్తూరి రెడ్డి చేస్తున్న సేవలను గుర్తించి వైసీపీ అధిష్టానం పార్టీ అధ్యక్షునిగా నియమించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తరువులను జారీ చేసింది. కస్తూరి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.
SKLM: సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం టూ టౌన్ పట్టణ స్టేషన్ సీఐ పీ.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతిని వేధించినందకు గాను నిందితులను అరెస్టు చేశామని సీఐ చెప్పారు.
KMM: ఎర్రుపాలెం మండలం సీపీఎం పార్టీ మండల కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మామునూరు గ్రామ వరి, మొక్కజొన్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యల పట్ల సంబంధిత అధికారులు స్పందించి లంకా సాగర్ నుంచి కట్లరు నదికి నీరు వదలాలని డిమాండ్ చేశారు.
SRD: కంగ్టిలో గిరిజన సంక్షేమ కళాశాల వసతిగృహంలో విద్యార్థులు అల్పహారం తయారు చేయడంపై జిల్లా కలేక్టర్ వల్లూరు క్రాంతి నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తికి విచారణకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీఓ కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు, సిబ్బందికి అడిగి తెలుసుకొన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు.
SKLM: APUWJ రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీ.సోమసుందర్ వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులు బెండి నర్సింగరావు (టెక్కలి), ఎం.వి మల్లేశ్వరరావు (శ్రీకాకుళం), కొంచాడ రవికుమార్ (పలాస), జీ.శ్రీనివాసరావు (పాతపట్నం)లు ఎన్నికయ్యారు.
SKLM : ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేదితో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కె .రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏపీలో చేపట్టే ముఖ్యమైన వ్యవసాయ కార్యక్రమాలపై చర్చించారు అన్నారు. రైతుల సంక్షేమం, పురోగతి పట్ల మా నిబద్ధత, ప్రణాళికలను కార్యదర్శికి వివరించారని వెల్లడించారు.
SKLM: సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన,అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు.
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 19 రోజుల్లో రూ.78,31,047 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 82 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండి, 130 విదేశీనోట్లు, మిశ్రమబియ్యం 13 క్వింటాళ్లు వచ్చాయన్నారు.
NLR: కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.