నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. 53వ డివిజన్, 5వ డివిజన్ పెన్నానది బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 66 కుటుంబాల గురించి చర్చించారు. పెన్నానదికి వరద ఉధృతి వచ్చినప్పుడు వారిని పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.