NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6గంటల నాటికి సోమశిల జలాశయంలో 53.269 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 285 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం: మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో కుక్కలు బెడదతో గ్రామస్తులు భయం భయంతో జీవిస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు మహిళలను వెంటపడి మరీ కరిచాయి. ఎస్సీ పాలెంలో సుమారు 40 కుక్కలకు పైగా వీధుల్లో తిరుగుతూ నిత్యం పొలాలకు వెళ్లే వారిని, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కుక్కలను తీసుకువెళ్లాలని కోరారు.
NLR: ప్రస్తుతం జరుగుతున్న IPL మ్యాచ్‌లో యువత బెట్టింగ్‌కు దిగి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగుల్లో ప్రతిసారి గెలుస్తామన్నది అవివేకమని, ఒక జూదం వంటిదని తెలిపారు. బుకీలు ఖాతాలలో ఎప్పుడూ డబ్బు ఉంటుందని, కానీ బెట్టింగ్ పాల్పడే వారే అప్పుల్లో ఉంటారని సూచించారు.
కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని హీరో శర్వానంద్ దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో పూజలు చేశాడు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
KMR: రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌కి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్‌లు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉన్నత పదవిని పొందాలని, ప్రజల శ్రేయస్సు కోసం మరింతగా కృషి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు.
KNR: రంజాన్ పండుగ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌లో వారి స్నేహితులు సయ్యద్ షా ఖాజా మొహినుద్దీన్ ఖాద్రి, షాస మొల్ల నివాసానికి వెళ్ళి ఉత్సాహంగా గడిపారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
JN: చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన గూగులోత్ రామోజీ ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు నగదు, రెండు తులాల బంగారం మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలంలోని ఐతురాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పంగ నిఖిల్ అనే యువకుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నిఖిల్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి అకాల మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని మసీదులో సోమవారం రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక నమాజ్ ప్రార్ధనల్లో నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
HNK: రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్ నుంచి డిప్యూటీ సీఎం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాజీవ్ వికాసం పథకాన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి విజయవంతం చేయాలన్నారు.
SKLM: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా తీరని అన్యాయం చేస్తుందని రెల్లి కుల సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. సోమవారం నరసన్నపేటలోని స్థానిక పురుషోత్తం నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 వర్గాలకు చెందిన ఎస్సీ వర్గీకరణలో భాగంగా కేవలం మహిళలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు.
TG: HCA- సన్ రైజర్స్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాసుల వ్యవహారంపై సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని HCA ప్రెసిడెంట్ బెదిరించారనే ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. SRH యాజమాన్యాన్ని పాసుల కోసం బెదిరిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాగా, ఇప్పటికే పాసుల వ్యవహారం, HCAపై SRH యాజమాన్యం సీఎంవోకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
AP: కృష్ణా జిల్లా అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పసికందుతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
PLD: జన్మభూమి అప్ డేటెడ్ వెర్షన్ P-4 అని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో సోమవారం మీడియాతో మాట్లాడారు గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జన్మభూమి గ్రామాల రూపురేఖలు మార్చిందన్నారు. ఇప్పుడు ఆయన ఆలోచన నుంచి పుట్టిన P-4 దేశానికే మార్గదర్శకంగా నిలవనుందన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సంపన్న వర్గాలు చేయూతనివ్వడమే P-4 విధానమని చెప్పారు.