SKLM: డీ-మత్యలేశం ప్రజల నిజ జీవితం ఆధారంగా తండేల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మత్స్యకారుల జీవితాలను ప్రపంచానికి చూపించిన చిత్ర బృందం, నటీనటులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అభినందనలు తెలిపారు. అలాగే అసలైన తండేల్ రామారావు దంపతులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో గురువారం సత్కరించారు.
MBNR: రేపు నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీంతో కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తారని గ్రామ వాసులు ఆశతో ఉన్నారు. గత నెలలో కోటకొండ మండలం ఏర్పాటు చేయాలని దీక్షలు చేయగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివకుమార్ రెడ్డి సీఎం వచ్చినప్పుడు ప్రకటన చేస్తారని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారి ఆశలు ఫలిస్తాయని ఆకాంక్షిస్తున్నారు.
VZM: ఇమామ్, మౌజాన్‌ల గౌరవ వేతనాన్ని గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లులను విడుదల చేశారని విజయనగరం ఎమ్మెల్యే అతిది గణపతిరాజు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని తప్పుడు హామీలిచ్చారన్నారు.
SKLM: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులకు ఇచ్చే దోబీలు, బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలను గురువారం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజక వృత్తుల వారికి కేటాయించిన దోబిలకు అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలకు రహదారి సౌకర్యాలు కలిపిస్తున్నామన్నారు.
ASR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ధనుంజయ్ అన్నారు. గురువారం హుకుంపేట మండలం ఉప్ప గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సత్యారావుతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలన్నారు
CTR: పుంగనూరు పట్టణం పుష్కరి వద్ద గల ఆలయంలో దక్షిణామూర్తికి గురువారం విశేషపూజలు జరిగాయి. ముందుగా, గణపతి పూజ, పుణ్య వచనాలు, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనము, వీభూదితో అభిషేకం చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు.
NRPT: రేపు నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి కోరారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్న సీఎంకి ఘనంగా స్వాగతించేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
పల్నాడు: మాజీ కేంద్ర హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. ఆయన వర్దంతిని చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల కోసం, పార్లమెంటులో నైతిక విలువల కోసం ఆయన జీవితాంతం కృషి చేశార...
ADB: ఆదిలాబాద్‌లోని ఓ ఛానెల్లో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన కంచు సుభాష్ కుటుంబానికి జర్నలిస్ట్ JAC ఆర్థిక సాయం అందించింది. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడానికి జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కలిసి రూ.52,100 నగదు జమచేసి వాటిని గురువారం సుభాష్ భార్యకు అందించారు.
NRML: లక్ష్మణ్చందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిఇఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం పోచమ్మ గడ్డ వద్ద కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని లేనిపక్షంలో ఆటో డ్రైవర్లందరం రహదారిపై బైఠాయించి ధర్నా చేపడతామని ఆటో యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ గురువారం హెచ్చరించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం వేలాదిమంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారని దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
TPT: తిరుమలలో మరోసారి విమానం కలకలం సృష్టించింది. ఆలయ గాలిగోపురం మీది నుంచి ఫ్లైట్ వెళ్లడంతో అధికారులు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. కాగా ఇటీవల కూడా తిరుమల ఆలయం పైన విమానం చక్కర్లు కొట్టింది. దీంతో తరచూ విమానాల రాకపోకలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది.
PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
ఢిల్లీ నూతన సీఎంగా నేడు రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె సీఎం అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త సీఎంపైనే ఉండనుంది. మహిళల ఖాతాల్లోకి రూ.2500, యమునా నది శుద్ధి, పథకాలకు నిధులు, రోడ్ల మరమ్మతు-చెత్త కుప్పల నుంచి విముక్తి వంటి నాలుగు పెద్ద సవాళ్లను ఎదుర్కోనున్నారు.