కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,78,462 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 139 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 1983 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.