రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం అన్నదాత సుఖీభవ, రైతు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.