JGL: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు.
AP: విశాఖకు డేటా సెంటర్లు తీసుకొచ్చిందే జగన్ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములు కాపాడాలనే గురుమూర్తి పిల్ చేశారు. విశాఖ భూదోపిడీపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నాం. ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. భూ కేటాయింపులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ప్రకాశం: దొనకొండ ఎస్సై, సిబ్బంది ముందస్తు సమాచారంతో వి.వి పురం గ్రామంలో ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.17,420ల నగదు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
TG: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ప్రాజెక్టు అమలు విధానం, ముందస్తు ఏర్పాట్లు, అవసరమైన సాంకేతిక సదుపాయాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
BDK: ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామంలో ఆదివాసీలు గడ్డి కోమరాజు జాతర నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసి సంస్కృతి సంప్రదాయం తో కూడిన నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. జాతరలు నిర్వహించడం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగం అని తెలిపారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఉండేలా సీసీ రోడ్డు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన బైక్‌లు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయని సీఐ సత్యనారాయణ తెలిపారు. చెత్తకు నిప్పు పెట్టడంతో అది ప్రమాదవశాత్తు వచ్చి స్టేషన్ ఆవరణలోని వాహనాలకు వ్యాపించిందన్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పి వేశారని పేర్కొన్నారు.
KMM: మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు గురువారం వారు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఈ నెల 14వ తేదీన షటిల్ టోర్నమెంట్ ప్రారంభించనున్నట్లు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ. 7,500, తృతీయ బహుమతి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ATP: గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి అత్త బేడల నాగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాప వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నాయకులు బేడల నాగమ్మ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
2026 T20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా విమర్శించాడు. టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం అతడు చేసిన పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు. ఈ నిర్ణయంతో మ్యాచ్ ప్రారంభానికి 30 నిమిషాల ముందే కివీస్ ఓడిపోయిందన్నాడు. NZ మొదట బ్యాటింగ్ ఎంచుకుంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
AKP: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పాయకరావుపేటలో చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. వేసవి సందర్భంగా దాహార్తిని తీర్చేందుకు స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినట్లు స్త్రీ నిధి ఏజీఎం సిద్ధిక్, వెలుగు ఏపీఎం ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు చలివేంద్రం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ASF: తీర్యాని మండల ఆశ్రమ హైస్కూల్‌లో “పోలీసులు మీ కోసం” కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందజేసి, వారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసుల ఈ చొరవపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను, తిరుపతి విమానాశ్రయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్‌కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డిని లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు.
GNTR: విజిలెన్స్ & ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేశారు.