• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

WPL: యూపీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

WPL-3లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కిరణ్‌ నవ్‌గిరే (51) అర్ధ శతకం చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ సదర్లాండ్ (41) రాణించారు.

February 19, 2025 / 11:19 PM IST

కేసీఆర్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

TG: మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ‘ఇప్పటికే 3 MLC స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య ఉన్న వైరాలే మీ పార్టీ భూస్థాపితానికి ఆరంభం. BRSకు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందనుకోవడం మీ భ్రమ. రాష్ట్రంలో రేపటి రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీదే. బయటకి ఇప్పుడు వచ్చావ్ మళ్లీ ఎప్పుడొస్తావో’ అంటూ ఎద్దేవా చేశారు.

February 19, 2025 / 08:28 PM IST

‘అసత్య ప్రచారాలను ఖండించిన దళిత నాయకులు’

VZM: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి RRR రఘురామకృష్ణ రాజు ఆర్థిక నేరాలపై విచారణ చేపట్టాలిని విజయనగరం అంబేద్కర్ ఇండియా మిషన్ బుధవారం డిమాండ్ చేశారు. దళిత IPS పీవీ సునీల్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారాలను విజయనగరం జిల్లా దళిత సంఘాల సభ్యులు కెల్లా భీమారావు తదితరులు ఖండించారు.

February 19, 2025 / 08:18 PM IST

బూత్ ఇంఛార్జ్‌ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: ద్వారకాతిరుమల మండలం మారంపల్లి గ్రామంలో మండల ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇంఛార్జ్‌ల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

February 19, 2025 / 08:17 PM IST

శ్రీ మఠం హుండీల ద్వారా రూ.3.29 కోట్ల ఆదాయం

NLR: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు బుధవారం సాయంత్రానికి ముగిసిందని శ్రీ మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. హుండీ లెక్కించగా.. రూ.3,21,05,005 కరెన్సీ, రూ.8,10,100 చిల్లర నాణేలతో కలిపి మొత్తం రూ.3,29,15,105 వచ్చిందన్నారు. 58 గ్రాముల బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు వెల్లడించారు.

February 19, 2025 / 08:11 PM IST

వేసవులు తాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలి

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు, గ్రామీణ ప్రాంతంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోను ఆదేశించారు. బుధవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు.

February 19, 2025 / 08:00 PM IST

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

NLR: వరికుంటపాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కోలాట నృత్యాన్ని ఆయన వీక్షించారు.

February 19, 2025 / 07:52 PM IST

‘సృజనాత్మకతో బోధన చేయండి’

SKLM: ఆమదాలవలస పట్టణ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న మెలుకువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందేలా బోధన చేయాలని వారికి సూచించారు.

February 19, 2025 / 07:44 PM IST

అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు: కలెక్టర్

NRML: వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 24వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా, అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

February 19, 2025 / 07:44 PM IST

ఆలపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలి

కృష్ణా: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావంతులు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

February 19, 2025 / 07:40 PM IST

బ్యాంకర్లతో ఎంపీడీవో సమావేశం

NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం ఎంపీడీవో సాల్మన్ సమావేశమయ్యారు. వివిధ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వాటిని ఇవాళ మొదటి విడత స్క్రూటినీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తామని, ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీవో సాల్మన్ వెల్లడించారు. 

February 19, 2025 / 07:35 PM IST

‘స్నేహభావంతో మమేకం కావడానికే పల్లె నిద్ర’

VZM: ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మమేకం కావడమే పల్లెనిద్ర కార్యక్రమం ఉద్దేశ్యమని ఎస్సై ఎల్ దామోదర్ రావు అన్నారు. పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామంలో పోలీస్ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ యువత సహకరించాలని కోరారు.

February 19, 2025 / 07:33 PM IST

విద్యుత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: జమ్మిగడ్డ ఎస్ఈ విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతిరోజు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఎంత లోడ్ వాడుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే వేసవి దృష్ట్యా వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

February 19, 2025 / 07:28 PM IST

ప్రయాణికులకు మెరుగైన ఫీవర్ అందించాలి: ఆర్ ఎం

NRML: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ఎం సొలోమోన్ అన్నారు. నిర్మల్ బస్ డిపోలో నిర్వహిస్తున్న శిక్షణ ఇవాళ నాటికి రెండో రోజుకు చేరుకుంది. సమిష్టిగా కృషి చేస్తూ సంస్థ మనుగడకు పాటుపడాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, రాజశేఖర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

February 19, 2025 / 07:16 PM IST

‘అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు’

NRML: అంగన్వాడీల ఉన్నతీకరణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. అంగన్వాడీల అభివృద్ధి, ఉన్నతీకరణ తదితర అంశాలపై బుధవారం సంక్షేమ శాఖ జేడి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అంగన్వాడీలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

February 19, 2025 / 07:14 PM IST