MBNR: అధికార కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కొత్త ఇళ్లు కట్టి ఇవ్వాలని ఉన్న ఇళ్లను కూల్చకూడదని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాధితులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం బాధితులకు ఇచ్చినట్టుగా ఆదర్శనగర్ బాధితులకు ఇళ్లు ఇవ్వాలన్నారు.