TG: TGPSC నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అనేది అత్యంత ముఖ్యమైనది. TGPSC తాజాగా ఒక కొత్త సంస్కరణను తీసుకువచ్చింది. ఇకపై అభ్యర్థులు ఏడాదికి రెండుసార్లు మాత్రమే తమ OTRను అప్డేట్ చేసుకునే వీలుకల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో సుమారు 10 రోజుల పాటు ఈ విండో అందుబాటులో ఉంటుంది.