• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కదిరి పర్యటనకు ఎంపీ లక్ష్మణ్

ATP: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ కదిరి పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బెంగళూరు నుంచి కదిరికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. కదిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశంలో పాల్గొని నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

January 15, 2025 / 01:20 PM IST

‘యువకులు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ’

ADB: ఉట్నూరు పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కోర్సులలో ఉచిత శిక్షణకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ తెలిపారు. టూ వీలర్ మెకానిక్, హౌస్ వైరింగ్ కోర్సులలో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు నిజ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

January 15, 2025 / 01:19 PM IST

వరంగల్ నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు

WGL: వరంగల్ నగరంలో పోలీసులు రెండు రోజులుగా విస్తృత తనిఖీలను చేపట్టారు. ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వ గ్రామాలకు వెళ్లిన నేపథ్యంలో చోరీలకు అవకాశం ఉండడంతో గస్తీని ముమ్మరం చేశారు. వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ నేతృత్వంలో సీఐలు ఎస్సై లతోపాటు పోలీసు సిబ్బంది లాడ్జీలు, హోటల్స్‌తో పాటు రహదారులను దిగ్భందించి వాహనాలను తనిఖీ చేశారు.

January 15, 2025 / 01:00 PM IST

ఈ నెల 17న శ్రీ కృష్ణ దేవరాయ 554వ జయంతి వేడుకలు

NLR: ఈ నెల 17వ తేది శ్రీ కృష్ణ దేవరాయ 554వ జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నట్లు ఉదయగిరి యాదవ్ చైతన్య వేదిక నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. దుత్తలూరు మండలం నర్రవాడలోని యదువంశ బృందావనంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి యాదవ సోదరులు బాధ్యతతో కదిలి రావాలని, తిరునాళ్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

January 15, 2025 / 12:57 PM IST

పెనుశిల నరసింహ స్వామి సేవలో కొండవీటి జ్యోతిర్మయి

NLR: రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రముఖ గాయని కొండవీటి జ్యోతిర్మయి కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

January 15, 2025 / 12:54 PM IST

‘మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి’

అనంతపురం: రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు బుధవారం ఆయన నివాసంలో టీడీపీ వార్డు ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జనవరి 18న స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాయదుర్గంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరం గురించి ఈ సమావేశంలో చర్చించారు. కూటమి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

January 15, 2025 / 12:40 PM IST

ఆస్కార్‌ వేడుక రద్దు.. క్లారిటీ!

ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌పై ఆస్కార్ అకాడమీ స్పందించింది. ‘ఆస్కార్ అవార్డుల వేడుకను రద్దు చేయాలనే ఆలోచన అకాడమీకి లేదు. వేడుకల్లో ఎలాంటి మార్పు ఉండదు. మార్పులుంటే స్వయంగా మేమే వెల్లడిస్తాం’ అని తెలిపింది. కాగా.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది.

January 15, 2025 / 11:20 AM IST

అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశా: అశ్విన్

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అశ్విన్‌కు అవమానం జరగడంతోనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. తాజాగా వీటిపై అశ్విన్ స్పందించాడు. ‘బయట అనుకొనేవన్నీ నిజాలు కాదు. నేను బ్రేక్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశా. అంతకంటే మరే కారణం లేదు’ అని పేర్కొన్నాడు.

January 15, 2025 / 11:14 AM IST

కొండన్న మృతి కార్మిక లోకానికి తీరని లోటు

NRPT: సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న మృతి కార్మిక లోకానికి తీరని లోటు అని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. మక్తల్ మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన కొండన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

January 15, 2025 / 10:17 AM IST

మంత్రికి బర్త్ డే విషెస్ చెప్పిన మడకశిర MLA

SS: పెనుకొండ పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జన్మదిన వేడుకలు జరిగాయి. మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

January 15, 2025 / 09:30 AM IST

ఈ నెల 19న మోడల్ డీఎస్సీ పరీక్ష

అనంతపురం: ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మోడల్ డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్లలో సమాచారం అందించామని, త్వరలోనే హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఆధార్ లేదా ఓటర్ ఐడీ తప్పనిసరిగా తీసుకుని రావాలని కోరారు.

January 15, 2025 / 09:13 AM IST

శ్రీ సత్యసాయి క్రీడాకారుల ప్రతిభ

SS: షూటింగ్ బాల్ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు.జిల్లాకు చెందిన నలుగురు 43వ జూనియర్స్ నేషనల్ ఏపీ షూటింగ్ బాల్ పోటీలకు సెలెక్టయ్యారని జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ శీను,సెక్రటరీ ఉదయ్ వెల్లడించారు.ఒడిశా రాష్ట్రం జగన్నాథ స్టేడియంలో ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే పోటీల్లో హిందూపురానికి చెందిన దివ్య, హారిక పాల్గొంటారు.

January 15, 2025 / 08:46 AM IST

ప్రత్యేక అలంకరణలో పూజలందుకున్న వన దుర్గమ్మ

MDK: జిల్లా పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం వన దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేశారు. జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తెల్లవారి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక నది పాయలో పుణ్యస్నానం చేసి వన దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.

January 15, 2025 / 08:29 AM IST

మాంసపు దుకాణాల వద్ద క్యూ కట్టిన ప్రజలు

ATP: గుత్తిలో బుధవారం కనుమ (పార్వేట) పండగ సందర్భంగా చికెన్, మటన్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున మాంసం కొనుగోలు కోసం క్యూ కట్టారు. పట్టణంలోని శాంతి ప్రియ హాస్పిటల్స్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మాంసం దుకాణాల వద్ద జనాలు చికెన్, మటన్ కోసం క్యూ కట్టారు. రోడ్డుపై వాహనాలతో స్వల్ప ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేజీ మటన్ ధర 650 ఉండగా వంద రూపాయలు పెంచి 750 చేశారు.

January 15, 2025 / 08:27 AM IST

ఆర్ఎఫ్ ఏపీ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ

ATP: జిల్లాలో ఓ ప్రైవేట్ విడిది గృహం నందు మంగళవారం ఆర్ఎఫ్ ఏపీ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా జేఎన్టీయూఏ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు హాజరై డైరీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పూలే అంబేడ్కర్ ఆశయాలతో పనిచేస్తున్న ఆర్పీఎఫ్‌కి అభినందనలు తెలిపారు.

January 15, 2025 / 08:26 AM IST