CTR: పట్టణంలోని బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్ (12) అనే బాలుడు తన స్నేహితుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో సమీర్ స్నేహితుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సమీర్‌పై అతని మామ కోపంతో గదిలో పెట్టి తలుపు వేశాడు. తిరిగి వచ్చి కొడుతాడన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
PDPL: సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామం నుంచి కనుకుల టర్నింగ్ రోడ్డు అధ్వానంగా మారింది. తారు పోయి గుంతలు పడడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, గ్రామస్తులు వాపోతున్నారు. ఈ దారి గుండా వెళ్లడంతో బైకులు రిపేర్కి గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్డుకి మరమ్మతు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
SRCL: జిల్లా వేములవాడలో అయ్యప్ప స్వామి అభరణాలను ఊరేగించారు. మకర సంక్రాంతి సందర్భంగా గత 27 సంవత్సరాల నుంచి వేములవాడ అయ్యప్ప దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు అభరణాలతో ఊరేగింపుగా వెళ్లారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
KNR: భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇద్దరు చిన్నారులు హరిదాసు వేషధారణలో ఆకట్టుకున్నారు. నుదుట తిలకం, ఓ చేతిలో చిరతలు, మరో చేతిలో వీణ, తలపై అక్షయపాత్ర, చుట్టూ పూలదండ, కాలికి గజ్జెలు, మెడలో పూలహారాలతో సందడి చేశారు. కొక్కొండ గోపీనాథ్ చారి, వర్ష దంపతులు కుమారులు వెంకట నారాయణ, విరాట్ నందన్లకు హరిదాసు వేషధారణ వేసి మురిసిపోయారు.
KNR: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తకొండ ఆలయ ఛైర్మన్ శేఖర్ గుప్తా, ఈఓ కిషన్ రావు ప్రారంభించారు. వీరన్న జాతరకు విచ్చేసే భక్తుల కోసం ఉచిత తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
VZM: దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న సాలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని సాలూరు పట్టణానికి చెందిన బలగ శ్యామ్(19) మృతి చెందాడు. దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న బస్సుకు చంద్రమ్మపేట సమీపాన ద్విచక్రవాహనంతో ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ బస్సుకిందలకు పోయి నుజ్జునుజ్జు అయింది. సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసారు.
NRML: సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు అప్పుడే పుట్టిన శిశువును స్థానిక కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయిందని, అటుగా వెళుతున్న గ్రామస్తులు శిశువును చూసి స్థానికులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
NLG: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం చేపడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేయడంలో విఫలమైయిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామన్నారు.
SRD: పటాన్ చెరు పట్టణంలోని నాయి బ్రాహ్మణ స్మశాన వాటిక గేటు పాడైపోయింది. ఈ సమస్యను పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దృష్టికి నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన కార్పొరేటర్ సొంత నిధులతో స్మశాన వాటికకు నూతన గేటు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు కార్పొరేటర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
NRML: నిర్మల్ పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం ముగిసాయి. దాదాపు నెల రోజులపాటు దేవరకోట ఆలయంలో నిర్వహించిన ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గోదాదేవి శ్రీమన్నారాయణ ప్రసన్నం చేసుకోవడానికి చేసిన పూజా వ్రతాలను కన్నులకు కట్టినట్లు వివరించారు.
ADB: జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు త్వరలో బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు ADB ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. వాహనదారులకు జనవరి నుంచి జూన్ నెల వరకు నిజ ధ్రువపత్రాలు సమర్పించి తిరిగి పొందడానికి మరో అవకాశం కల్పించామన్నారు.
కడప: బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: దేవరాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు (రాజేశ్వరి) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, బండారు తనయుడు అప్పలనాయుడు పాల్గొన్నారు.
SRD: పటాన్ చెరు మండలం కర్ధనూరు గ్రామం వద్ద చైనా మాంజతో ఓ వ్యక్తి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వికారాబాద్‌కు చెందిన వెంకటేష్ (34) పటాన్‌చెరు నుంచి శంకర్‌పల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గొంతు తెగిన వెంకటేష్‌ను స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి, పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు.
SFPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామకోటి కార్యాలయంలో మంగళవారం పతంగుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్థానిక భక్తి సమాజం వ్యవస్థాపకులు, భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక చిన్నారులకు, యువకులకు పతంగులు ఆయన పంపిణీ చేశారు.