ELR: కామవరపుకోట మండలం కళ్లచెరువులోని మాజీ ఏఎంసీ ఛైర్మన్ మేడవరపు అశోక్ ఇంట్లో వైసీపీ నేతల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు. మండలంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మండలంలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే అంశాలపై పలు సూచనలు చేశారు.
NLR: జిల్లా రూరల్ పరిధిలోని 18వ డివిజన్లో బుధవారం రూ.74 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రకాశం: సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట రైతుసేవా కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారిణి పావని రైతు విశిష్ట గుర్తింపు కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నిర్ణయించింది. కావున రైతులందరూ రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.
పల్నాడు: ఎన్నికల ముందు తన సవాల్‌కు గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు స్పందించలేదని మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాసు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు పిడుగురాళ్ల ప్రభుత్వం మెడికల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనట్లు యరపతినేని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశానన్నారు.
ప్రకాశం: రాచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తానని చెప్పారు.
ప్రకాశం: ఒంగోలులో నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రి రవీంద్రను మరో మంత్రి స్వామి కలుసుకుని తాజా రాజకీయ అంశాలపై మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.
GNTR: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల, దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఓటు వేయాలని అధ్యాపకులను కోరారు.
MNCL: జిల్లాలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ నేటి యువతరానికి ఆదర్శప్రాయం అన్నారు.
NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ముక్త్యాల రోడ్డు నందు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వారి ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఇందులో తదితరులు పాల్గొన్నారు.
NRML: జాతీయ రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామం సమీపంలోని జాతీయ రహదారులను వారు పరిశీలించారు. జాతీయ రహదారుల మార్గంలో ప్రతినిత్యం శుభ్రంగా ఉంచేలా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
MNCL: లైంగిక దాడికి గురైన బాధితులు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్‌కు వచ్చే వరకు పరిహారం ఇప్పించే వరకు భరోసా సెంటర్ వారికి అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. నస్పూర్‌లోని భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లీగల్, మెడికల్ చిన్నారుల కౌన్సిలింగ్ గదులను పరిశీలించారు.
KDP: సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని రైతులు తరచూ వాపోతున్న విషయం తెలిసిందే. చిరుతలను చూశామని తెలపడంతో ఫారెస్ట్ అధికారులు పొలాల్లో ట్రాక్ కెమెరాలు బిగించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం లింగాల, కామసముద్రం గ్రామాల్లో రెండు ట్రాక్ కెమెరాలను అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో ఓ బాలుడు మంగళవారం తప్పిపోయాడు. తల్లిదండ్రుల వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచి తమ కొడుకు లక్కీ కనబడటం లేదని, పలుచోట్ల వెతికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఎవరికైనా బాలుడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి అన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ మందిర 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. యువకులు జిల్లా, రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.