NRML: అదిలాబాద్ డైట్ కళాశాలలో సూపర్డెంట్గా విధులు నిర్వహిస్తున్న భోజన్న ఇటీవలే జనగామ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గంగాధర్, గజేంద్ర సింగ్, క్రాంతి, వివేక్, రాజ్, సెక్టోరియల్ అధికారులు రాజేశ్వర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఐదవ డివిజన్ రెడ్డి కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ పూజల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
AP: వైసీపీ ఎంపీ వైసీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటో కోర్టు ద్వారా కేసులు పెట్టి పోరాటం చేస్తామని తెలిపారు. చంద్రబాబు, పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై అక్రమంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 7 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
HNK: భోగి రోజున అభినవ భీముడు జన్మించాడు. వివరాల్లోకి వెళితే. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రంపీస పూజిత-ప్రేమ్ కుమార్ దంపతులకు మొదటి సంతానంలో మగ బిడ్డ జన్మించాడు. సాక్షాత్తు భీముని రూపంలో నాలుగు కిలోల మూడు వందల గ్రాముల బరువుతో జన్మించాడు. ఆ పుణ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు మురిసిపోతున్నారు.
WGL: డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో భోగి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిల్ల వీరభద్రం (81) అనారోగ్యంతో మృతి చెందాడని వారు తెలిపారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
WGL: వర్దన్నపేట MLA కెఆర్ నాగరాజు ప్రజల పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా పెద్దలు, చిన్న పిల్లలు సరదాగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మాంజా దారం వాడవద్దన్నారు. పిల్లలకి గాని పెద్దలకి గాని, ఎన్నో రకాల పక్షి జాతులకు మాంజా దారం తగిలి ప్రాణాలు పోతున్నాయన్నారు. కావున సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు.
WGL: వరదన్నపేట మండలం కట్రాల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను నేడు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు. టీజీ టెస్ కాపు ఛైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
KMM: చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
JN: స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు గ్రామంలో నేడు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పతంగుల పండుగను మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. పిల్లలకు పతంగులను పంపిణీ చేసి ఎమ్మెల్యే వారితో కలిసి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.
KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశయం మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ ఛైర్మన్ యరగర్ల హన్మంతరావు పేర్కొన్నారు. మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి ఇప్పటికే రూ.కోట్లలో నిధులు కేటాయించారని చెప్పారు. ఆయా పనులు పూర్తి చేయించి రైతులకు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య మకర సంక్రాంతి శుభాకాంక్షలు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంతో కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని కోరారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు విరజిల్లాలని కోరారు.
TG: పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీకి ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో ఉపయోగకరమని చెప్పారు. త్వరలో పసుపు పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు సాగునీరు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని వంశధార నరసన్నపేట డివిజన్ ఈఈ ప్రదీప్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ.. గొట్టా బ్యారేజ్లో 0.2 టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు.
W.G: వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో మద్యం మత్తులో మనవడు చింతా నాగరాజును హత్య చేసిన తాత ఆదినారాయణను సోమవారం అరెస్ట్ చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపారు. శనివారం రాత్రి మద్యం తాగి తాత మనవడు మిగిలి ఉన్న మద్యం బాటిల్ కోసం గొడవపడ్డారు. వివాదంలో తాత మనవడి చాకుతో పొడిచి చంపిన విషయం విధితమే. సోమవారం ఆదినారాయణను న్యాయస్థానంలో హాజరు పరిచారు.
KMM: మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పండుగ నుంచి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.