NLR: మనుబోలు మండల రైతులను అకాల వర్షం నిండా ముంచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలులు వీయడంతో భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదే సమయంలో రైతుల పొలంలో వందలాది ఎకరాలలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అసలే ధరలు లేవని అల్లాడుతున్న రైతులకు అకాల వర్షంతో మరింత దెబ్బతిన్నారు.
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ముందుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కిరణ్‌కు ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలించారు. డీఎస్పీ మరళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు కోర్టు వద్ద మోహరించారు.
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకు పెరుగుతోంది. ట్రంప్ బెదిరింపులకు డ్రాగాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చైనా ప్రొడక్ట్స్‌పై అమెరికా145శాతం టారిఫ్ పెంచితే డ్రాగాన్ నుంచి అదే రియాక్షన్ వచ్చింది. తాజాగా అమెరికా ఉత్పత్తులపై చైనా 125శాతానికి టారిఫ్‌లను పెంచింది.
AP: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తోపాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు గంటపాటు జోగి రమేష్‌ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్లానని, ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.
NDL: సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి, మహాత్మా శ్రీ జోతి రావు పూలే అని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పాముల పాడు మండలoలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వామపక్ష, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
AP: కర్నూలు జిల్లా DEO కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మధ్యకాలంలో శ్రీనివాసులు మహిళ ఉద్యోగులతో చెడుగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో కడప RJD3 విచారణ జరిపారు. విచారణలతో అభియోగాలు వాస్తవాలని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
NTR: జిల్లాలో 80, 859 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,295 మంది ఫస్టియర్, 39,564 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. రేపు శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో జిల్లాలోని విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
MLG: జిల్లా న్యాయస్థానంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అడ్వకేట్ వేణుగోపాలచారి, వారి కార్యవర్గానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బజారు శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మేకల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. దన్నూరు గ్రామస్తులు మార్చి 30న తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగిందని అనిల్ జాదవ్ తెలిపారు. రైతుల సౌకర్యార్థం శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
WGL: కాకతీయ మెగా టెక్స్‌టైల్ కంపెనీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు అధికారులు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సంగెం మండలంలో ఈరోజు 2వ బ్యాచ్ కుట్టు విషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాంతి మండల సమాఖ్య కార్యాలయంలో HR సుచిత్ర ఈ తరగతుల ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి దొరుకుతుందన్నారు.
NLR: రాపూరు పట్టణంలో శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి 7:30కు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ తరలిరావాలని కోరారు.
విజయవాడలోని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు.
GNTR: గుంటూరు నగరంపాలెం ట్రావెలర్స్ బంగ్లా వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
MNCL: అట్టడుగు వర్గాల్లోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,సావిత్రి బాయి ఫూలే దంపతులని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
MNCL: సమాజానికి మార్గదర్శకులు మహాత్మ జ్యోతిబాపూలే అని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.