JGL: వినియోగదారులకు, రైతులకు సేవల్లో వేగాన్ని, పారదర్శకతను పెంచుతూ క్షేత్రస్థాయిలో పనులను సులువుగా చేయడానికి ఈ-స్టోర్ విధానం ఉపయోగపడుతుందని జగిత్యాల SE బీ. సుదర్శనం తెలిపారు. అవసరమైన విద్యుత్ సామగ్రిని ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారని, అవసరమైన మెటీరియలు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా నమోదు చేసి ఈ-స్టోర్స్ నుంచి తీసుకుని ప్రారంభించవచ్చాన్నారు.
VKB: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని టీపీయూఎస్ (TPUS) నేతలు విజ్ఞప్తి చేశారు. తాండూర్లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం వినతిపత్రం అందజేశారు. తక్షణమే వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ICC టోర్నీల్లో జైత్రయాత్ర చేస్తున్న టీమిండియాకు సౌతాఫ్రికా చేతిలో ‘T20 WC సూపర్ 8 మ్యాచ్’ ఓటమితో మూడ్ అఫ్ అయ్యిందని కెప్టెన్ సూర్య తెలిపాడు. అయితే బాహుబలి ‘నిప్పులే శ్వాసగా’ పాటతో గత రెండేళ్లలో భారత బ్యాటర్ల ఆటను చూపిస్తూ చేసిన రీల్, అలాగే బౌలర్ల కోసం కేసరి-2 ‘ఓ శేరా’ పాటతో రీల్ భారత ప్లేయర్ల మూడ్ మార్చేశాయని పేర్కొన్నాడు. ఇలాంటివే జట్టును బలంగా మారుస్తాయన్నాడు.
NLR: గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో కొత్తగా నిర్మించిన ఈద్గాను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం రాత్రి ప్రారంభించారు. ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. ఈద్గా అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
VKB: ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తామని మైనారిటీ నాయకుడు ఎస్ఎం.గౌసన్ అన్నారు. కొడంగల్లో రోడ్డు విస్తరణలో అక్రమంగా తొలగించిన మహిబూబ్ సుభాని దర్గాను యథా స్థానంలో పునః నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చినా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.
MBNR: మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందనను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది.
WNP: నాగపూర్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో యూరియా పంపిణీ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 600 బస్తాలు ఇవాళ అందుబాటులో ఉండగా, స్లాట్ బుకింగ్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రైతులు తమ గుర్తింపు పత్రం, పాసుబుక్/పట్టాదారు పత్రాలు తీసుకుని సమయానికి సంఘం కార్యాలయం వద్ద హాజరుకావాలని కోరారు. బుకింగ్ ముందుగా పూర్తయ్యే అవకాశం ఉన్నందున, ఆలస్యం చేయకుండా చేరుకోవాలని సూచించారు.
SRD: జిన్నారం మున్సిపల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు 12వ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. నేడు చివరి పరీక్ష కావడంతో బాగా చదివి రాయనున్నట్లు విద్యార్థులు తెలిపారు.
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కోండిగారి రాములు(80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించారు. 1989, 1994లో రెండు పర్యాయాలు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ సంక్షేమశాఖ శాసనసభ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
VZM: తెర్లాం మండలం కొనయవలస గ్రామ సర్పంచ్ బోడల విజయబాబు శుక్రవారం ఉదయం మృతి చెందారు. వారం రోజులు క్రిందట అనారోగ్యంతో విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌లో రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి ప్లేటు ఖరీదు దాదాపు రూ 24.25 అవుతుండగా, సామాన్యుడు చెల్లించేది రూ.5 మాత్రమే. మిగిలిన రూ.19.25 సబ్సిడీని GHMC భరిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు కేటాయిస్తోంది. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కేవలం వంట వండటమే కాకుండా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంది.
ELR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తణుకు హైవే నుంచి ఏలూరు వైపు వస్తుండగా షణ్ముఖ, నవీన్, చరణ్ తేజ్, అరవింద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5.320 కేజీల గంజాయి, నాలుగు మోటర్ సైకిలు, వెండి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు DSP శ్రావణ్ కుమార్ తెలిపారు.
HYD: తాజ్ కృష్ణా హోటల్లో MRDCL ఆధ్వర్యంలో నేడు ‘MUSI INVITES’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారన్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
KNR: విద్యుత్ మెటీరియల్ సేకరణలో ఇకపై కాగిత రహిత (పేపర్స్) విధానం అమలులోకి వచ్చినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. గతంలో మెటీరియల్ కోసం పలు దశల పేపర్ ప్రక్రియ ఉండేదని, ఇప్పుడు ‘ఈ-స్టోర్’ ద్వారా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయి సిబ్బందికి పని సులభతరమై, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.