నెల్లూరు: గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు.
VZM: డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామంలోని రచ్చబండ వద్ద పేకాట స్థావరంపై ఎస్సై సన్యాసినాయుడు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 76,330 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 346 పాయింట్ల నష్టంతో 23,085 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.61 వద్ద స్థిరపడింది.
AKP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో గల రసూల్ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము తెలిపారు. చెయ్యి పూర్తిగా దెబ్బ తినడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పరిశ్రమల యజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేసినట్లు విమర్శించారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 16 వరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. నియోజకవర్గ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఎవరు క్యాంపు కార్యాలయానికి రావద్దని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
విశాఖ: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెం క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం మాస్ గెటప్‌లో ఫొటోకు ఫోజులు ఇచ్చారు. నెత్తిపై తలపాగా, కూలింగ్ అద్దాలు, పందెం కోడిపుంజు పట్టుకుని ఫొటో దిగారు. అభిమానులు పార్టీ శ్రేణుల కోరిక మేరకు ఆమె కాసేపు ఈ విధంగా మాస్ గెటప్‌లో కనిపించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో పయనించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కోరుకున్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజలకు, అధికారులకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని దేవున్ని వేడుకున్నారు.
నెల్లూరు: భోగి పండగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు నరసింహకొండకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖ: రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ప్రియాంక దండి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలో ఇసుకతోట వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగంపై దాడి చేస్తూనే ఉందన్నారు.
KRNL: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం కర్నూలు నగరంలో స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో డీవీఆర్ సంస్థ ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ప్రధానం చేశారు.
KRNL: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల జట్టులో పాల్గొన్న పర్వేజ్, గౌతమ్ రాజు మొదటి స్థానం సాధించగా, బాలికల విభాగంలో కళ్యాణి మూడో స్థానంలో నిలిచారని సాఫ్ట్ బాల్ క్రీడా జిల్లా కార్యదర్శి విజయ్ తెలిపారు.
పల్నాడులోని ప్రసిద్ధి చెందిన ధర్మవరం శ్రీ హరిహర బాల నాగేంద్రస్వామి దేవస్థానంలో శివ ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం నైవేద్య, నిరాజనాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు సుధాకర్ శాస్త్రి ఏర్పాట్లు పర్వేక్షించారు.
ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న నార్నె సురేశ్ అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు: ఉదయగిరి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బోగినేని కాశీరావు, బోగినేని గాంధీ ఆదివారం రోజు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నందు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కొద్దిసేపు తాజా రాజకీయాలు పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
నెల్లూరు: అల్లూరు మండలంలోని పురిని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా సోమవారం విశేష పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలతో, వేద పండితుల నడుమ శ్రీ వీరాంజనేయ స్వామి వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.