SRPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చివ్వేంల మండలం అక్కలదేవి గూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వర్ వివరాల మేరకు.. ఖమ్మంకు చెందిన ఉమ్మెత్తెల కిరణ్ పద్మాకర్ ద్విచక్ర వాహనంపై హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పల్నాడు: భోగి పండుగ సందర్భంగా సోమవారం ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహించారు. గరుడ వాహనంపై నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవంలో అర్చకులు పాండు రంగాచార్యులు అర్చనలు చేశారు. గ్రామస్థులు మంగళహారతులు సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్త సంఘాలు, మహిళా సంఘాలు, యువకులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గోదాదేవి సమేత రంగనాథుని కళ్యాణం వైభవంగా జరిగింది. భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం ఆ దేవాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల విగ్రహాలను వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథుని కళ్యాణం ఘనంగా జరిగింది.
నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడలోని ప్రాచీన జనార్ధన స్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవాలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మాదాల బాబురావు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి ఈ ఆలయం శిథిలావస్థకు చేరగా.. కోటి రూపాయల వ్యయంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆయన వివరించారు.
పల్నాడు: రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో వేంచేసియున్న వల్లభేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు పరమేశ్వరరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ, ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్సి పరిధిలోని మామిడిగూడ గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్, రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు సోమవారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా రోడ్డు భద్రత, ఆరోగ్య నియమాలను ప్రజలకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ భరించాలని సూచించారు.
SRPT: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీగోదా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పీసీసీ సభ్యులు కొప్పుల వేణారెడ్డి దంపతులు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఘనంగా గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించి భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
BHNG: తెలుగు వారి పండుగ సంక్రాంతి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి మీకు భోగభాగ్యాలను, సంక్రాంతి మీకు సుఖసంతోషాలను, కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని, మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంకున్నట్లు పేర్కొన్నారు.
లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విక్రమ్.. దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని చిత్ర బృందం ఎంపిక చేసిందట. కానీ, ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.
KDP: త్రాగునీరు వృథా చేయవద్దని ప్రభుత్వం ప్రచారాల మేరకే తప్ప ఆచరణలో కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం-1 రెడ్డి వారి వీధి రోడ్ నెంబర్-16లో గత కొద్ది నెలలుగా మంచినీటి పైపు డామేజ్ కావడంతో రహదారి జలమయమై, ప్రజలు అవస్థలు పడుతున్నారు. వృథాగా పోతున్న త్రాగునీటిని అరికట్టి మరమ్మత్తులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
HYD: నిత్యం వివిధ కార్యక్రమాల్లో ఉండే మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గాలిపటాలను ఎగరేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
KDP: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి నిలుస్తుందన్నారు.
HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్‌ను సీఎం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 16 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ పాల్గొనబోతున్నారు. అదే విధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటారు.
VSP: విశాఖ నగరం బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద సోమవారం ఉదయం విశాఖ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్షా ఒక్క పిడకలతో భోగిమంట వేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
GNTR: మంగళగిరి బాపూజీ విద్యాలయంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచిన సమన్వితను చినజీయర్ స్వామి అభినందించారు. శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ కుమార్తె సమన్వితకు ఆదివారం చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేసి, సర్టిఫికెట్, శేష వస్త్రం అందజేశారు.