• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాలల మహా సింహ గర్జనకు తరలిరండి: మూర్తి

సత్యసాయి: పెనుకొండలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో మాల నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఈనెల 23న వర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ జిల్లాల మాలలతో నిర్వహించు మాలల మహా సింహ గర్జన సభకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. మాలల మహా సింహ గర్జన సభకు జిల్లా నుండి మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

February 17, 2025 / 03:38 PM IST

మాజీ ఎమ్మెల్యే రాకతో వైసీపీ నాయకుల్లో జోష్

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని సోమవారం నెలగొండ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు జయరాంరెడ్డి మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే రాకతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ వచ్చిందని తెలిపారు.

February 17, 2025 / 03:36 PM IST

‘నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలి ‘

సత్యసాయి: రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆద్వర్యంలో పెనుకొండ ఆర్డీవోకి 200 మందితో సంతకాలతో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా శ్రీ సత్యసాయి జిల్లా నాయకురాలు గౌతమి, అంజనా దేవి, స్థానికులు సుమిత్ర, కావేరి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

February 17, 2025 / 03:18 PM IST

వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా వేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

February 17, 2025 / 02:25 PM IST

హేతుబద్ధీకరణపై మంత్రి సమీక్ష

AP: హేతుబద్ధీకరణపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలవీరాంజనేయస్వామి చర్చలు జరిపారు. అనంతరం ఉద్యోగుల నుంచి మంత్రి వినతిపత్రాలను స్వీకరించారు. తమకు పదోన్నతులు కల్పించాలని, PRC వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ABC కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

February 17, 2025 / 02:20 PM IST

రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి

మంచిర్యాల: పెద్దంపేట రైల్వే స్టేషన్లో రైలు కింద పడి సోమవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వయస్సు 50-55 సంవత్సరాలు ఉండగా, ఎడమ చేతిపై జనగామ లక్ష్మి అని పచ్చబొట్టు ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఈ నంబర్లకు 8328512176, 9490871784 సమాచారం ఇవ్వాలని సూచించారు.

February 17, 2025 / 02:19 PM IST

కేసీఆర్‌కు జగన్, పవన్ విషెస్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏపీ మాజీ సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం, సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అలాగే, కేసీఆర్ నిత్యం సంతోషంగా ఉండాలని, ప్రజలకు మరింతకాలం సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

February 17, 2025 / 02:17 PM IST

మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే

SRD: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.

February 17, 2025 / 02:10 PM IST

జర్నలిస్టుపై దాడి ఖండించిన జెడ్పీ ఛైర్మన్

VZM: మక్కువ మండలానికి చెందిన ఓ ప్రముఖ పత్రకా విలేఖరి రామారావుపై టీడీపీ నాయకుడు దాడి చేయడాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని, వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, దాడులు సరైనవి కాదన్నారు.

February 17, 2025 / 01:52 PM IST

ఫిర్యాదుదారులకు అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ

NRML: ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని సూచించారు.

February 17, 2025 / 01:51 PM IST

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువకుల రక్తదానం’

ADB: మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సంతోష్ సింగ్ తదితరులున్నారు.

February 17, 2025 / 01:47 PM IST

‘సమ్మెకు సిద్ధంగా ఉండండి’

ELR: చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడి కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌వి ఎస్ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన అంగన్వాడీల బ్రతుకు మారలేదన్నారు. 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ నేటి వరకు అమలు కాలేదన్నారు. రాబోయే కాలంలో మరో సమ్మె చేస్తామన్నారు.

February 17, 2025 / 01:27 PM IST

‘జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి’

W.G: మన్యం జిల్లాలోని మక్కువ మండల విలేకరి మాల్యాడ రామారావుపై మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ గ్రంధి పవన్ కుమార్‌కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.

February 17, 2025 / 01:17 PM IST

ప్రధాన సమస్యలపై సీపీఎం వినతులు

ATP: రాయదుర్గం పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీలు, కాలువలు లేక వివిధ వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే.

February 17, 2025 / 01:15 PM IST

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

SRD: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్ హాలులో డీఆర్ఓ పద్మజా రాణి, డీపీఓ సాయిబాబా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 17, 2025 / 01:00 PM IST