• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా రంగనాథుని కళ్యాణం

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గోదాదేవి సమేత రంగనాథుని కళ్యాణం వైభవంగా జరిగింది. భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం ఆ దేవాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల విగ్రహాలను వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథుని కళ్యాణం ఘనంగా జరిగింది.

January 13, 2025 / 12:35 PM IST

30 నుంచి జనార్ధనస్వామి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలు

నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడలోని ప్రాచీన జనార్ధన స్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవాలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మాదాల బాబురావు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి ఈ ఆలయం శిథిలావస్థకు చేరగా.. కోటి రూపాయల వ్యయంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆయన వివరించారు.

January 13, 2025 / 12:34 PM IST

రొంపిచర్లలో వైభవంగా ఆరుద్ర నక్షత్ర పూజలు

పల్నాడు: రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో వేంచేసియున్న వల్లభేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు పరమేశ్వరరావు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ, ప్రసాదాలను భక్తులకు అందజేశారు.

January 13, 2025 / 12:30 PM IST

‘రోడ్డు భద్రత నియమాలపై కళాజాత ప్రదర్శన’

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి పీహెచ్సి పరిధిలోని మామిడిగూడ గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్, రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు సోమవారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా రోడ్డు భద్రత, ఆరోగ్య నియమాలను ప్రజలకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ భరించాలని సూచించారు.

January 13, 2025 / 12:25 PM IST

ఘనంగా శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం

SRPT: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీగోదా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పీసీసీ సభ్యులు కొప్పుల వేణారెడ్డి దంపతులు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఘనంగా గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించి భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

January 13, 2025 / 12:17 PM IST

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఐలయ్య

BHNG: తెలుగు వారి పండుగ సంక్రాంతి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి మీకు భోగభాగ్యాలను, సంక్రాంతి మీకు సుఖసంతోషాలను, కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని, మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంకున్నట్లు పేర్కొన్నారు.

January 13, 2025 / 12:01 PM IST

ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయిపల్లవి

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో మూవీకి నో చెప్పినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో విక్రమ్.. దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని చిత్ర బృందం ఎంపిక చేసిందట. కానీ, ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.

January 13, 2025 / 11:29 AM IST

పైపు పగిలి వృథాగా పోతున్న త్రాగునీరు

KDP: త్రాగునీరు వృథా చేయవద్దని ప్రభుత్వం ప్రచారాల మేరకే తప్ప ఆచరణలో కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సిద్దవటం మండలంలోని మాధవరం-1 రెడ్డి వారి వీధి రోడ్ నెంబర్-16లో గత కొద్ది నెలలుగా మంచినీటి పైపు డామేజ్ కావడంతో రహదారి జలమయమై, ప్రజలు అవస్థలు పడుతున్నారు. వృథాగా పోతున్న త్రాగునీటిని అరికట్టి మరమ్మత్తులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

January 13, 2025 / 09:02 AM IST

ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు: తలసాని

HYD: నిత్యం వివిధ కార్యక్రమాల్లో ఉండే మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవళ్లు, మనవరాళ్లతో ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గాలిపటాలను ఎగరేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

January 13, 2025 / 08:49 AM IST

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

KDP: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి నిలుస్తుందన్నారు.

January 13, 2025 / 08:41 AM IST

కైట్ ఫెస్టివల్ను ప్రారంభించనున్న సీఎం

HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్‌ను సీఎం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 16 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ పాల్గొనబోతున్నారు. అదే విధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటారు.

January 13, 2025 / 08:29 AM IST

లక్ష ఒక్క ఆవు పిడకలతో భోగిమంట

VSP: విశాఖ నగరం బీచ్ రోడ్డు వైఎంసీఏ వద్ద సోమవారం ఉదయం విశాఖ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్షా ఒక్క పిడకలతో భోగిమంట వేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

January 13, 2025 / 08:12 AM IST

సమన్వితను అభినందించిన చినజీయర్ స్వామి

GNTR: మంగళగిరి బాపూజీ విద్యాలయంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచిన సమన్వితను చినజీయర్ స్వామి అభినందించారు. శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ కుమార్తె సమన్వితకు ఆదివారం చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేసి, సర్టిఫికెట్, శేష వస్త్రం అందజేశారు.

January 13, 2025 / 07:47 AM IST

విశాఖ జూ పార్క్ ఆదాయం రూ.3.84 లక్షలు

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశాఖ జూను సందర్శించారు. దీంతో జూలో సందడి వాతావరణం నెలకొంది. సందర్శకుల ద్వారా ఆదివారం ఒక్కరోజు రూ.3.84 లక్షల ఆదాయం సమకూరినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు.

January 13, 2025 / 07:46 AM IST

భోగి వేడుకల్లో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే

బాపట్ల: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పార్టీ నాయకులతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల పట్టణంలోని శ్రీక్షీర భావనారాయణ స్వామి దేవాలయం దగ్గర భోగి మంటల చితిని ఎమ్మెల్యే వెలిగించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి సంప్రదాయాలను సంరక్షిస్తున్నటువంటి పండగలు సంక్రాంతి, భోగి అని అన్నారు.

January 13, 2025 / 07:35 AM IST