NRML: అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ పాఠశాలల మాదిరి మార్చి 15 నుంచి ఒంటిపూట తరగతుల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా అంగన్వాడి టీచర్లు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. మే నెలలో టేక్ హోమ్ రేషన్ పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించాలని విన్నవించారు.