ADB: రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్వహణలో ఉన్న జిల్లా పోలీసులను సంప్రదించవచ్చని, పోలీసులు అండగా ఉంటూ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.