జొన్నలగడ్డ గురప్ప శెట్టి.. కలంకారీ కళాకారుడు. అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళకు పునర్జీవం పోశారు. ఈ కలంకారీలో సహజ సిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ రామాయణ, మహా భారతం ఘట్టాలను వస్త్రాలపై అద్భుతంగా చిత్రీకరించారు. ఈ కళలో ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే హస్తకళాకారులకు అందించే ‘శిల్ప గురు’ అవార్డును కూడా పొందారు.