SKLM: జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ టీ. వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈనెల 28న ముగుస్తుందని చెప్పారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు తమ పరిధిలోని రైతు సేవాకేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది, మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.