KMR: మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 15 వరకు మండలంలోని గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీ వివరాలపై ఈ వేదికలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.