ASR: కొయ్యూరు మండలం కొమ్మిక బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం పాఠశాల 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్లు పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. విద్యార్ధులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.