AP: గ్యాస్ సరఫరా అంశంపై CM చంద్రబాబు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించిన మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ అంశంపై మంత్రుల సబ్ కమిటీ(నాదెండ్ల, అచ్చెన్న, పయ్యావుల) ఉ.11:30 గంటలకు భేటీ అవుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ పరంగా ఎంత చేయాలో అంతా చేయాలని, కేంద్రం సమన్వయంతో ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా వారికి సీఎం సూచించారు.