ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించాలని గ్రామస్తులు పేర్కొన్నారు.