MBNR: పాత పాలమూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యతను సమీక్షించిన ఆమె, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు నిర్వహిస్తున్న హెల్త్ స్క్రీనింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.