NGKL: బల్మూర్ మండలంలోని బాణాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ మంగళవారం ప్రారంభించారు. గ్రామస్తులకు మెరుగైన సేవలందించేందుకే ప్రభుత్వం నూతన భవనాలను నిర్మిస్తోందని తెలిపారు. సర్పంచ్ దేశ్య నాయక్, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాంప్రసాద్ గౌడ్, ఎమ్మార్వో, ఏఎస్సై శివ కుమార్ పాల్గొన్నారు.